వైసీపీలోకి మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్
న్యూస్ తెలుగు/అమరావతి; మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి
వైసీపీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. (Story: వైసీపీలోకి మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్)