Google search engine
Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స‌మాచార‌మిస్తే రూ.10 లక్షలు

స‌మాచార‌మిస్తే రూ.10 లక్షలు

స‌మాచార‌మిస్తే రూ.10 లక్షలు

మావోయిస్టుల క‌ట్ట‌డికి వారాంతపు సంతలో ప్రచారం

న్యూస్‌తెలుగు/చింతూరు: మావోయిస్టుల యాక్షన్ టీం సభ్యుల సమాచారం తమకు తెలియజేయాలని అలా తెలియజేసిన వారికి ఐదు నుండి 10 లక్షల రూపాయల నజరానా ఉంటుందని చింతూరు యస్ ఐ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏడుగురాళ్లపల్లి సంతలో విస్తృత ప్రచారం చేశారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో సంచరిస్తున్న మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల సమాచారాన్ని తమకు అందించాలని సంతలో విస్తృత ప్రచారం చేశారు. ఈ మేరకు 1 8 మంది పేర్లతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఎవరైనా కనిపిస్తే తమకు గాని, ఉన్నతాధికారులైన సి ఐ, డి యస్ పి, ఒ యస్ డి, యస్ పి లకు సమాచారం ఇస్తే లక్షల రూపాయల నజరానా ఉంటుందని సమాచారం తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. (Story: స‌మాచార‌మిస్తే రూ.10 లక్షలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!