టీడీపీ తీర్థం పుచ్చుకున్న దస్తగిరి దంపతులు
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చీఫ్ విప్ జీవీ, మక్కెన

న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక నాయకులు, వారి అనుచరులు అంతా కూడా వినుకొండ పట్టణం, రాష్ట్ర అభివృద్ధి కోసం కలసి పనిచేయాల్సిన తరుణమిది అని పిలుపునిచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. విజ్ఞత. విశాల హృదయంతో అభివృద్ధి, సుపరిపాలన కోసం తెలుగుదేశంలో చేరేవారందర్నీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తామన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ ఛైర్మన్ దస్తగిరి దంపతులు శుక్రవారం తెదేపాలో చేరారు. దస్తగిరితో పాటు 9, 18, 27, 30వ వార్డుల కౌన్సిలర్లు రెడ్డి నాగపద్మ, పాల్వాది ఆంజనేయులు, ఐలపోగు హేమలత, షేక్ షకీలా తెదేపా తీర్థం పుచ్చుకొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండలోని తన కార్యాలయంలో వీరికి కండువా తెదేపా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా సిద్ధాంతాలు, జగన్ విధ్వంసక విధానాలు నచ్చకే తాము వైకాపాను వీడినట్లు వారు వివరించారు. ఈా సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ తెలుగుదేశంలో పార్టీలోకి చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు. వినుకొండ పట్టణాన్ని ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేద్దామని రాజకీయాలకు అతీతంగా అంతా కలసి వస్తే ముఖ్యమంత్రి నుంచి నిధులు తీసుకుని వచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. వార్డులు, పట్టణం అభివృద్ధి ఎప్పుడూ నా వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కొత్తగా వచ్చిన నాయకులు, వారి అనుచరులకు గౌరవం ఉంటుందని, కలసి పనిచేద్దాం. అభివృద్ది చేద్దామన్నారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇద్దరు, ఎన్నికల అనంతరం నలుగురు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. తాజాగా ఛైర్మన్ సహా ఐదుగురు కౌన్సిలర్లు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. పురపాలక సంఘ పరిధిలో మొత్తం 32 మంది కౌన్సిలర్లు ఉండగా నాడు జరిగిన ఎన్నికల్లో 28 మంది వైకాపా అభ్యర్థులు, నలుగురు తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. వైకాపా నుంచి గెలిచిన వారిలో 9 మంది తెదేపాలో చేరడంతో కౌన్సిల్ లో తెదేపా బలం 4 నుంచి 11కి చేరింది. (Story : టీడీపీ తీర్థం పుచ్చుకున్న దస్తగిరి దంపతులు)

