Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రామలింగేశ్వరస్వామి ఘాట్‌రోడ్‌ లోపాలు సరిదిద్ది పూర్తి చేస్తాం

రామలింగేశ్వరస్వామి ఘాట్‌రోడ్‌ లోపాలు సరిదిద్ది పూర్తి చేస్తాం

0

రామలింగేశ్వరస్వామి ఘాట్‌రోడ్‌ లోపాలు సరిదిద్ది పూర్తి చేస్తాం

ఘాట్‌రోడ్, రామలింగేశ్వరస్వామి గుడి పనులు పరిశీలించిన జీవీ, మక్కెన

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండకు తలమానికమైన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాభివృద్ధి, ఘాట్‌రోడ్‌ నిర్మాణాల్లో లోపాలు సరిదిద్ది త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇప్పటికే ఘాట్‌రోడ్‌ పనులు పునఃప్రారంభించామని, అయితే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మన్నాయుడు ఇష్టారాజ్యంగా చేసిన లోపభూయిష్టమైన పనుల్ని ముందు సరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ఘాట్‌ రోడ్‌ పనులు స్వయంగా చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు పరిశీలించారు. అనంతరం జివి మాట్లాడుతూ. ఘాట్‌రోడ్ వేగంగా పూర్తి చేయాలన్నదే లక్ష్యమన్నారు. నాటి ఎమ్మెల్యే బొల్లా కాంట్రాక్టర్‌ను పనులు ఆపేయమని, ఆయనే ఇంజినీర్, ఎమ్మెల్యే, కాంట్రాక్టర్‌గా దోచుకున్నారని మండిపడ్డారు. రహదారి మొత్తం దెబ్బతిందని, రాళ్లు వచ్చి పడుతున్నాయని, ఇవే జనంపై పడితే ఎంత నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గించుకోవడం కోసం స్లోపింగ్ సరిగా పెట్టక పోవడం, తీసిన బండరాళ్లు తరలించకుండా అక్కడే వదిలేయడం సహా ఎన్నో తప్పులు చేశారన్నారు. సైడ్ స్లోప్స్ లేకపోవడం, రక్షణ గోడలు, కాల్వలు నిర్మించనందున వర్షాలకు రహదారి కోతకు గురైందన్నారు. అందుకే రాష్ట్రస్ధాయిలో అనుభవజ్ఞులైన ఇంజినీర్లు పిలిపించి జరిగిన నష్టాన్ని ఎలా సరిదిద్దాలి, భవిష్యత్తులో ప్రజలకు నష్టం లేకుండా ఏ విధంగా చేయాలనే సలహాలు తీసుకుంటామన్నారు. ఘాట్‌రోడ్ నిర్మాణానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్న జీవీ బండరాళ్లతో వర్షకాలం మరింత ముప్పని చెప్పినా పట్టించుకోక పోవడం దుర్మారంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోనే సీనియర్ స్తపతిని తీసుకొచ్చి ఇంకా మెరుగ్గా ఎలా చేయవచ్చో కూడా సలహాలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే తీసి కొండ అంచుల్లో ప్రమాదకరంగా ఉన్న బండ రాళ్లు వేరేచోటకు తరలించాలని అధికారులకు సూచించారు. పాత కమిటీలో కొందర్ని తీసుకుని కొత్త కమిటీ ఏర్పాటు చేసి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రామలింగేశ్వరస్వామి, అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్టాపన చేస్తామన్నారు. అవసరమైన మేరకు కొంత ఎత్తు తగ్గించి… బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లేలా ఇంజినీర్ల సలహాతో లోపాలు సరిదిద్దుతామన్నారు చీఫ్‌ విప్ జీవీ. గత వైసీపీ ప్రభుత్వంలో వినుకొండ అభివృద్ధికి రూపాయి తీసుకురావడం బొల్లాకి చేతకాలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబును అడిగిన వెంటనే రూ.2 కోట్లు మంజూరు చేశారన్నారు. వినుకొండ రామలింగేశ్వరస్వామి గుడిని పర్యాటక కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. (Story : రామలింగేశ్వరస్వామి ఘాట్‌రోడ్‌ లోపాలు సరిదిద్ది పూర్తి చేస్తాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version