అభివృద్ధికి బాటలు వేసింది నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఏదుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ నిరంజన్ రెడ్డి సమక్షంలో చేరారు. గ్రామ పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా నాయకత్వములో శేషిరెడ్డి,ప్రవీణ్ కుమార్ రెడ్డి,భారత్ కుమార్ రెడ్డి,నరేందర్ రెడ్డి,సురేష్,రాజు,బుచ్చి రెడ్డి,భాస్కర్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి తదితరులు చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదుల మండల కేంద్రం చేయడంలో, ఏదుల రిజర్వాయర్ వంటి పథకాల వల్ల మండలం మొత్తం సస్యశ్యామలం చేశారని అభివృద్ధికి మారు పేరు నిరంజన్ రెడ్డిని అన్నారు. సమాచార లోపం కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోయామని అందుకే నిరంజన్ రెడ్డి గారికి అండగా నిలవాలని నిర్ణయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్, నందిమల్ల.అశోక్,సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి,రాజు రెడ్డి మాజీ ఎం.పి.టి.సి,రమేష్ మాజీ సర్పంచ్,సునీల్ కుమార్ మాజీ సర్పంచ్,శేషయ్య మాజీ ఉపసర్పంచ్,జాన్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. (Story :అభివృద్ధికి బాటలు వేసింది నిరంజన్ రెడ్డి)