రైతు నాయకులు ముప్పాళ్ళ చెన్నయ్య 9వ వర్ధంతి
న్యూస్ తెలుగు /వినుకొండ : గుర్రప్ప నాయుడుపాలెం మాజీ సర్పంచ్ మరియు మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు ముప్పాళ్ళ చెన్నయ్య, తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని పల్నాడు రోడ్డు లోని పెట్రోల్ బంకు వద్ద నిర్వహించారు. చెన్నయ్య ,విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ లాయరు ఏజిపి ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు, ఆయన తల్లి ముప్పాళ్ళ నారాయణమ్మ, కుటుంబ సభ్యులు మరియు న్యాయవాదులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ. ముప్పాళ్ళ. చెన్నయ్య ,ఆయన హయాంలో చేసిన పలు సేవా కార్యక్రమాలు ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం గుంటి ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు బార్ ప్రెసిడెంట్ కె. ఎస్. ఎం నాయుడు, నలబోతుల రామకోటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు, జెట్టి తిరుపతిరావు, మీసాల శ్రీనివాసరావు, భీమవరపు శ్రీనివాసరావు, సిద్దయ్య, గౌస్ ఖాన్ ,చంద్ర, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నక్క రమణ రావు, ఖాన్, సోమశేఖర్, తదితరులు పాల్గొని నివాళులర్పించారు. (Story : రైతు నాయకులు ముప్పాళ్ళ చెన్నయ్య 9వ వర్ధంతి)