Homeవార్తలు3 BHK - బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ రిలీజ్   

3 BHK – బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ రిలీజ్   

3 BHK – బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ రిలీజ్   

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు.

ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి3 BHK అనే ఇంట్రస్టింగ్ టైటిల్  పెట్టారు. సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని బ్యూటీఫుల్ ఫ్యామిలీగా కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.

”ఇది మన ఇంటి కథ ..ఈ ఇంట్లోనే చిన్న చిన్నగా చాలా కథలు వున్నాయి. ఇది మసాల డబ్బా కాదు.. అమ్మ గారి చిన్న బ్యాంక్. ఇది నాన్న గారి సెంటిమెంటు బీరువా’ అంటూ సిద్ధార్థ్ వాయిస్ తో మొదలైన టైటిల్ టీజర్ ఫీల్ గుడ్ మూమెంట్స్ తో చాలా క్యురియాసిటీని పెంచింది.

సిద్ధార్థ్ కూల్ అండ్ చార్మ్ లుక్ తో ఆకట్టుకున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు ప్రజెన్స్ కూడా అలరించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈసినిమా రూపొందుతొందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది.

ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్ డీవోపీగా పని చేస్తున్నారు. గణేష్ శివ ఎడిటర్. రాకేందు మౌళి డైలాగ్ రైటర్.

2025 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

నటీనటులు: సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు, మీఠా రఘునాథ్ , చైత్ర
రచన, దర్శకత్వం: శ్రీ గణేష్
నిర్మాత : అరుణ్ విశ్వ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్. సిబి మారప్పన్
ఫోటోగ్రఫీ డైరెక్టర్: దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్
సంగీతం: అమృత్ రామ్‌నాథ్
ఎడిటర్: గణేష్ శివ
డైలాగ్స్: రాకేందు మౌళి
ఆర్ట్ డైరెక్టర్: వినోద్ రాజ్‌కుమార్ ఎన్
కాస్ట్యూమ్ డిజైనర్: అశోక్ కుమార్ ఎస్ & కిరుతిక ఎస్
పీఆర్వో: వంశీ- శేఖర్ (Story : 3 BHK – బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ రిలీజ్   )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics