బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడిగా కోట
న్యూస్ తెలుగు / వినుకొండ : భారతీయ జనతా పార్టీ వినుకొండ పట్టణ శాఖ అధ్యక్షుడిగా కోట వెంకట సుధాకర్ ను భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ ప్రకటించారు. బుధవారం నరసరావుపేటలో జరిగిన నూతన మండల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ సమక్షంలో సుధాకర్ ను వినుకొండ పట్టణ శాఖ అధ్యక్షులుగా ప్రకటించారు. కోట వెంకట సుధాకర్ గతంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. కోట వెంకట సుధాకర్ ను వినుకొండ పట్టణ అధ్యక్షులుగా నియమించడం పట్ల నియోజకవర్గ ఇన్చార్జి యార్లగడ్డ లెనిన్ కుమార్ , ప్రస్తుత పట్టణ అధ్యక్షులు ఆడిటర్ రాఘవులు, ఉపాధ్యక్షులు సుధా గణేష్ బాబు, జిల్లా కార్యదర్శి గొడవర్తి సుజాత, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గోరంట్ల సత్యనారాయణ, శావల్యాపురం మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు , పూర్వ అధ్యక్షులు పూరేటి పేరయ్య, శివాది వెంకయ్య , జిల్లా ఓబిసి కార్యదర్శి పాలడుగు రాజు, జిల్లా యువమోర్చా కార్యదర్శి జాన్ బాబు, నారి శెట్టి మహేష్, లాయర్ ఎం వి అప్పారావు,తదితరులు అభినందనలు తెలిపారు. (Story : బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడిగా కోట)