ముప్పాళ్ళ జ్ఞానేశ్వర్ రావు కి సన్మానం
న్యూస్ తెలుగు / వినుకొండ : ముప్పాళ్ళ జ్ఞానేశ్వర్ రావు కి ఏజిపి ఇచ్చిన సందర్భంగా వినుకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఎస్ఎంవి నాయుడు, లాయర్ నక్కా రమణారావు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సమక్షంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 1104 యూనియన్ నాయకులు చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు జి.సిహెచ్.కొండలు మాట్లాడుతూ. స్నేహశీలి ,మంచి మనసున్న వ్యక్తికి ఏజిపి రావడం చాలా మంచి శుభ పరిణామం. వారికి ఇంకా ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షిస్తూన్నాం. కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు జిసిహెచ్ కొండలు, డివిజన్ అధ్యక్షులు డి.మన్నయ్య ,వినుకొండ నాయకులూ , టౌన్ లైన్మెన్లు సలీం సాంబశివరావు, అంజిరెడ్డి, కోటేశ్వరరావు, రమేష్ ,సీనియర్ నాయకులు టౌన్ లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య ,బాలకోటేశ్వరరావు పాల్గొన్నారు. (sTORY : ముప్పాళ్ళ జ్ఞానేశ్వర్ రావు కి సన్మానం)