ముఖ్య వ్యక్తుల భద్రతలో
అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ఎస్పీ వకల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : జిల్లా సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంలోగల ఫైరింగు రేంజ్లో వివిధ ఆయుధాలనువినియోగిస్తూ ముఖ్య వ్యక్తుల భద్రత విధులు నిర్వహించే పి.ఎస్.ఓ.లు ఫైరింగు ప్రాక్టీసును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – ముఖ్య వ్యక్తుల భద్రత విధుల నిర్వహణలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రత విధుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం తగదని, ముఖ్య వ్యక్తులను కలిసేందుకు వచ్చే వ్యక్తులను నిత్యం గమనించాలన్నారు. ముఖ్య వ్యక్తుల భద్రత విధులు నిర్వహించే పి.ఎస్.ఓ.లకు మూడు రోజులపాటు నిర్వహించిన రిఫ్రెషర్ కోర్సులో ముఖ్య వ్యక్తుల భద్రతకు వారు నిర్వహించే విధులు పట్ల,చేపట్టాల్సిన చర్యలు పట్ల, శారీరకదారుఢ్యం మెరుగు పర్చుకొనుటలో శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం, జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఫైరింగు నిర్వహించి, వారి నైపుణ్యాన్ని స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కూడా ఫైరింగు ప్రాక్టీసులో పాల్గొని, వివిధ ఆయుధాలతో ఫైరింగు ప్రాక్టీసు చేసారు. ఏకే 47, ఎం.పి. 5కే ఎ3 సబ్ మెషిన్ గన్, గ్లాక్ 17 ఆస్ట్రియా, గ్లాక్ 19ఎక్స్ యు.ఎస్.ఎ. మరియు మసాడ పిస్టల్స్ 10మీటర్లు, 15 మీటర్లు, 25 మీటర్ల మరియు 100మీటర్ల దూరం నుండి స్టాండింగు, నీలింగు పొజిషన్స్తో ఫైరింగు చేసి, టార్గెట్స్ ను చేధించి, తన ఫైరింగు నైపుణ్యాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ జి. నాగేశ్వరరావు, ఎస్బీ సిఐలు ఎ.వి. లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఆర్ఐ సెక్యూరిటీ టి. శ్రీనివాసరావు, ఆర్.ఎస్.ఐ. టి.రామారావు, ఆర్మర్, ఫైరింగు సహాయక సిబ్బంది పాల్గొన్నారు.(Story : ముఖ్య వ్యక్తుల భద్రతలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి)