ఘనంగా శ్రీ భావనా ఋషి స్వామి శ్రీ భద్రావతి అమ్మవార్ల కళ్యాణ వైభోగము నిర్వహణ
న్యూస్ తెలుగు / వినుకొండ : దక్షిణం బజార్ లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామి వారి దేవస్థానం నందు మంగళవారం శ్రీ భావనా ఋషి, శ్రీ భద్రావతి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు వేకువజం నుండే హాజరై స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం లోక కళ్యాణార్థం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు అవ్వారు కోటేశ్వరరావు, చిలివేరు ఏడుకొండలు, ఎం భాస్కర్ రావు, నీలి తులసీరామ్, అవ్వారు ప్రకాష్, కాల్వ సత్యనారాయణ యంగల బ్రహ్మం ఉక్కడపు ఆంజనేయులు, కె పరమేశ్వరరావు, పెద్ద శ్రేష్టి మహంకాళి వెంకటేశ్వర్లు, అనుముల కిరణ్ ,సంఘ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.(Story : ఘనంగా శ్రీ భావనా ఋషి స్వామి శ్రీ భద్రావతి అమ్మవార్ల కళ్యాణ వైభోగము నిర్వహణ)