పోలవరం ఎత్తు తగ్గిస్తే కూటమి నాయకులు చరిత్ర హీనులుగా మారుతారు
విద్యా , వైద్య, వ్యవసాయంకు కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శ
న్యూస్ తెలుగు/చింతూరు : గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే నానా రాద్ధాంతం చేసిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రనాకి తలొగ్గి పోలవరం ఎత్తు తగ్గిస్తే కూటమి ప్రభుత్వం చరిత్ర హీనులుగా మిగిలిపోతుంది సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. మంగళవారం ఉదయం స్థానిక సీపీఐ కార్యాలయంలో సీపీఐ పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు .ఇప్పుడు నిర్మాణంలో ఉన్న 45.7.2 డిజైన్ ఎలా ఉందో అదే విధంగా ప్రాజెక్టు పూర్తయితే దాని ప్రయోజనాలు రాష్ట్రానికి మేలు జరుగుతుందని అంతేకానీ ఎత్తు 41 .1 .15 ఎత్తి తగ్గిస్తే ఉపయోగం లేకుండా డ్యామ్ గా మిగిలి పోతుందని ఆమె అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉందన్నారు బడ్జెట్ కు ముందే ఎకనామిక్ సర్వే వచ్చిందని జాతీయ అభివృద్ధి తిరోగమన దశలో ఉందని కొనుగోలు శక్తి క్షీణిస్తుందని ఆ రిపోర్టులో ఉందన్నారు వేతనాలు పెరగకపోగా ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఉపాధిఅవకాశాలు సన్నగిల్లుతున్నాయని రిపోర్టు లో వచ్చిందని ఆ రిపోర్ట్ను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ కు పూర్తిగా పెట్టుబడిదారీ వర్గాలకు ఊతం ఇచ్చేలా ఉందని అన్నారు.
విద్య వైద్య వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గాయని రైతుల మద్దతు ధర ఊసే లేదని ఆమె విమర్శించారు ఆర్థిక అసమానతలు దేశంలో తీవ్రతం అవుతుందని ఆమె పేర్కొన్నారు కొద్ది మంది చేతుల్లో సంపద కేంద్రీకరించబడిందని రూపాయి పతనం దిశగా వెళుతుందని ద్రవ్యోల్ప్నం పెరుగుతుందని అన్నారు భారత్లో 64% జిడిపితో వికసిత భారత్ ఎలా సాధ్యమని ఆమె అన్నారు ఏపీ విభజన హామీలు చట్టంలో పేర్కొన్న అంశా లకు నిధులు రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు రాజధాని అమరావతి కు నిధులు ఇవ్వకుండా అప్పు ఇస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు విశాఖ జోన్ విశాఖ మెట్రో కడప స్టీల్ ఫ్యాక్టరీ లాంటి వాటికి నిధులు ఇవ్వలేదని తూర్పార పట్టారు
మావోయిస్టుల పేరుతో అడువులను కార్పేటర్ వ్యక్తులకు అప్పచెప్పటానికి ఆదివాసులను అడివి నుండి తరమివేయడాన్కి అమిత్షా ప్రవేశపెట్టిన కగార్ ఆపరేషన్ ను ముక్తకంఠంతో అన్ని వర్గాల వారు వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు సిపిఐ నగర్ కార్యదర్శి
వి కొండలరావు సహాయ కార్యదర్శి సప్ప రమణ జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీలు తదితరులు పాల్గొన్నారు.(Story : పోలవరం ఎత్తు తగ్గిస్తే కూటమి నాయకులు చరిత్ర హీనులుగా మారుతారు )