సైన్స్ లేనిదే అభివృద్ధి లేదు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణ కేంద్రంలో మదర్స్ ల్యాబ్ స్కూల్ నందు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని కి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . మదర్స్ ల్యాబ్ ప్రిన్సిపాల్ ముదిన్ గారు పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు.సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలోమదర్స్ ల్యాబ్ విద్యార్థులు తయారుచేసిన నమూనాలను చిన్నారెడ్డి పరిశీలించారు. దేశ ప్రగతి శాస్త్ర సాంకేతిక రంగం పరిశోధనలపై ఆధారపడి ఉంటుందన్నారు సమాజంలో మంచి చేయాలన్న చెడు చేయాలన్న సైన్స్ వల్ల నే సాధ్యమవుతుందని అని అన్నారు. ఈమధ్య కొన్ని దేశాలు సైన్స్ ను దుర్వినియోగపరుస్తూ యుద్ధాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించిన మదర్స్ ల్యాబ్ స్కూల్ ప్రిన్సిపాల్ ముదిన్ గారిని చిన్నారెడ్డి గారు అభినందించడం జరిగింది. మదర్స్ ల్యాబ్ స్కూల్ యజమాన్యం చిన్నారెడ్డి గారిని శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేయడం జరిగింది. కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ నాయకులు లాయర్ బాబా, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : సైన్స్ లేనిదే అభివృద్ధి లేదు