పాత బస్టాండ్ రీ ఓపెన్ త్వరగా చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పాత బస్టాండ్ రీ ఓపెన్ త్వరగా చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. పాత బస్టాండు రీఓపెన్ చేయడానికి తొమ్మిది లక్షల 60000 రూపాయలు వచ్చి చాలా కాలం అవుతుంది కానీ పనులు ముందుకు సాగడం లేదని, ఎందుకు ఆలస్యం అవుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్లు మూడు సంవత్సరాలుగా పోరాడి సాధించిన పాత బస్టాండు రీ ఓపెన్ కొత్తగా వచ్చిన అధికారులకు అర్థం కాక కొందరి ఒత్తిడితో వేరే వేరే ప్లాన్లు వేస్తున్నారని, కానీ రాజా రామేశ్వరావు అది పాత బస్టాండ్ కొరకే లీజుకి ఇచ్చారని దాన్ని మార్చడానికి వీలు లేదని డిఎం గారికి, మరియు ఆర్ ఎం గారికి తెలియజేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నందున తొందరగా పనులు పూర్తి చేయాలని ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిఎం గారి ద్వారా R M గారిని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు టిడిపి రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్, గిరిజన విద్యార్థి రాష్ట్ర నాయకులు శివ నాయక్, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, బీసీ సంఘం నాయకులు యాదయ్య, నాయకులు బొడ్డుపల్లి సతీష్, గోవిందు, యాదగిరి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.(Story : పాత బస్టాండ్ రీ ఓపెన్ త్వరగా చేయాలి)