SC, ST ఆవాస ప్రాంతాల రోడ్లకు మహార్దశ
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఈ నిధుల మంజూరీకి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సీతక్క కి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవికి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గిరిజన తండాలకు, ఎస్సీ కాలనీలలో రోడ్ల నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది
స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారి ప్రతిపాదనలతో కూడిన అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలకు 16 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జీవోలnu జారీ చేసింది దీంతో నియోజకవర్గం పరిధిలోని పలు తండాలకు రహదారుల నిర్మాణం, నియోజకవర్గ పరిధిలోని ఎస్సీ కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణాలను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రహదారుల నిర్మాణంతో పల్లె ప్రాంతాల్లోని ఆవశప్రాంతాలన్నింటికీ రోడ్డు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ నిధుల మంజూరీకి సహకరించిన ప్రభుత్వ పెద్దలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : SC, ST ఆవాస ప్రాంతాల రోడ్లకు మహార్దశ)