నాధమయ్యను కోల్పోవడం నాకు వ్యక్తిగతంగా తీరని దుఃఖాన్ని మిగిల్చింది
న్యూస్‌తెలుగు/వనపర్తి : పాతపల్లికి చెందిన సీనియర్ బి.ఆర్.ఎస్ నాయకులు నాధమయ్య రాత్రి గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి పాతపల్లికి చేరుకొని ఆయన పార్థీవ దేహాన్నికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు అండగా ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితం మొత్తం నా అడుగులో అడుగు వేశారని ఎప్పుడు కలసిన గ్రామ అభివృద్ది,ప్రజల సంక్షేమం కోరుకునే వారని కొనియాడారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకున్నారు. రావుల చంద్రశేఖరరెడ్డి వెంట వనం.రాములు,కర్రేస్వామి,రాజశేఖర్,కిషోర్ కుమార్ రెడ్డి,ఎల్లారెడ్డి,టి.ఎన్.ఎల్లారెడ్డి, మాజీద్, తదితరులు ఉన్నారు. (Story : నాధమయ్యను కోల్పోవడం నాకు వ్యక్తిగతంగా తీరని దుఃఖాన్ని మిగిల్చింది)