‘మజాకా’ నుంచి బ్యాచ్‌లర్ యాంథమ్ రిలీజ్
బ్యాచ్‌లర్స్ జీవితంలో ఉండే స్ట్రగుల్స్, జాయ్స్‌ను హైలైట్ చేసేలా ఉన్న ఈ సాంగ్ కుర్రాళ్లకు చార్ట్‌బస్టర్ కానుంది. పాపులర్ రైటర్ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట కుర్రాళ్లకు ఎవర్‌గ్రీన్ ఫేవరెట్ కానుంది. ఈ పాటలో బ్యాచ్‌లర్స్ తమ జీవితంలో పడే వంట కష్టాలు, సింగిల్ షాపింగ్ ట్రిప్స్ వంటి వాటిని చాలాబాగా ఎలివేట్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ధనుంజయ్ సీపాన ఎంతో హుషారుగా ఆలపించారు. కుర్రాళ్లందరికీ కనెక్ట్ అయ్యేలా తన గాత్రంతో కట్టిపడేశారు. లియోన్ జేమ్స్ అందించిన సంగీతం పాటకు మరింత ప్లస్ అయింది. రఘు మాస్టర్ అందించిన స్టెప్పులతో ఈ పాట సినిమాలో హైలైట్‌గా నిలవనుంది. ఈ పాటను సందీప్ కిషన్-రావు రమేష్‌లపై వైజాగ్ బీచ్‌లో చిత్రీకరించారు. తండ్రీకొడుకుల బ్యాచ్‌లర్ జీవితంలో ఎత్తుపల్లాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా తీశారు. వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను పడిపడినవ్వేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు ఈ బ్యాచ్‌లర్ యాంథమ్ బ్లాక్‌బస్టర్ బిగినింగ్‌లా చెప్పొచ్చు.
తారాగణం: సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రామేష్, అన్షు
సాంకేతిక బృందం:
దర్శకుడు: త్రినాధరావు నక్కిన
బ్యానర్స్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియో
నిర్మాతలు: రాజేష్ దండ, ఉమేష్ కేఆర్ బన్సల్
కథ, కథనం, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: గుట్ట బాలాజీ
లైన్ ప్రొడ్యూసర్: పాపూరి కిరణ్
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి
స్టంట్స్: పృధ్వి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా (Story : ‘మజాకా’ నుంచి బ్యాచ్‌లర్ యాంథమ్ రిలీజ్)