పదవతరగతి విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ పంపిణి
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక నిర్మల బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి 50 మంది విద్యార్థులకు ఉచితంగా అభిల్ కలామ్ థెరిస్సా సేవాసొసైటీ అధ్వర్యంలో వ్యవస్థాపకు రాలు చందోలు నాగవాణి మంగళవారం స్టడీ మెటీరియల్ పంపిణి చేశారు. పేద విద్యార్ధులు స్టడీ మెటీరియల్ ద్వార బాగ చదివి అత్యున్నత మార్కులు సాధించి పాఠశాలకు,తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని ఆమె కోరారు. పేద విద్యార్ధులు ఉన్నత స్థాయికి ఎదగాలని తమ అభిలాషనీయమన్నారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సిద్దార్థి, వార్డెన్లు సిస్టర్ మాణిక్యం, సిస్టర్ హాబర్ట్ లు పాల్గొన్నారు. (Story ; పదవతరగతి విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ పంపిణి)