విద్యార్థులు అవసరానికి ఆనుగుణంగానే చరవాణి వాడాలి
న్యూస్ తెలుగు /సాలూరు : విద్యార్థులు చరవాణి అవసరానికి ఆనుగుణంగానే వాడాలని, విద్యతోపాటు ఆటల్లో కూడా విద్యార్థులు రాణించాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం సాలూరు పట్టణం వెంకటేశ్వర కాలనీ లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ జ్యోతిరావు భాగ్ ఫూలే వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమపాఠశాలను ఆమె సందర్శించారు.విజయనగరం రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ 11 కంప్యూటర్లను మంత్రి సంధ్యారాణి ద్వారా పాఠశాలకు అందించటం జరిగింది.
పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలసిప్రారంభించారు. ఈ సందర్భంగా
విద్యార్దులకు అవసరమైన కంప్యూటర్లను పాఠశాలకు అందించిన రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందించారు.
విద్యార్దులు వేసిన సాంస్కృతిక నృత్యాలు, యోగాసనాలను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లలు ఇంటినుండి బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు చెప్పిన విధంగా మగపిల్లలు కూడా బయటకు వెళ్లినప్పుడు మహిళల పట్ల సోదరి భావంతో వుండాలని, వారిని గౌరవించాలని జాగ్రత్తలు చెప్పాలని తల్లితండ్రులకు సూచించారు.బాల్యవివాహాలను అరికట్టాలని తల్లితండ్రులకు అవగాహన కల్పించారు.
సెల్ ఫోన్లను అవసరమైన మేరకే ఉపయోగించాలని సెల్ ఫోన్లతో ఎంత ఉపయోగం వుందో అంతకంటే ఎక్కువగా చెడు ప్రభావం ఉంటుందని విద్యార్దులకు అవగాహన కల్పించారు.
పాఠశాలలో పిల్లలకు అందించే ఆహార నాణ్యతను పరిశీలించారు.
భోజనం రుచికరంగా ఉండడంతో పాఠశాల సిబ్బందిని అభినందించారు.
విద్యార్దులు చదువుతో పాటు ఆటలలో కూడా రాణించి ఉన్నత స్థానాలలో ఎదగాలని ఆశిస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మక్సుద్ అహ్మద్, నటరాజ్ , సిద్ధార్థ్, అవినాష్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు తెలుగుదేశం పార్టీ నాయకులు వైకుంఠపు హర్షవర్ధన్, డబ్బు కృష్ణ, బలగ శ్రీను, గంట వెంకట్ రాజు తదితరులు పాల్గొన్నారు. (Story : విద్యార్థులు అవసరానికి ఆనుగుణంగానే చరవాణి వాడాలి)