వినుకొండలో ప్రజా దర్బార్
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వినుకొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. సోమవారం వినుకొండ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జరగబోయే ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజా దర్బార్ జరుగుతుందన్నారు. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడే తక్షణం పరిష్కార చర్యలు చేపట్టేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినుకొండ గ్రామీణ మండలంలోని అన్నిగ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యలు, శాంతిభద్రతలు, పథకాల అందుబాటులో సమస్యలు సహా ఇబ్బందులను జీవీ దృష్టికి తీసుకుని రావొచ్చని పేర్కొన్నారు. అన్నివిభాగాల అధికారులు కూడా అక్కడే అందుబాటులో ఉంటారని, వెంటనే పరిష్కారాలు చూపిస్తారన్నారు. ప్రజాదర్బార్ కార్యక్రమం అనంతరం మండల అభివృద్ధి, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు.(Story : వినుకొండలో ప్రజా దర్బార్ )