అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి
జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జనసేన పార్టీ నాయకుడు గురాన అయ్యలు అన్నారు.. స్థానిక జీఎస్ఆర్ కాంప్లెక్స్ లో గురాన అయ్యలు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ..స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ స్వేచ్ఛాయుత భారతంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలని ఆకాంక్షించారు. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో భావితరాల కోసం పనిచేసే కొత్త తరం యువత రాజకీయాల్లోకి రావాలని జనసేన పార్టీ కోరుకుంటోందని తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాటం అశ్విని, సిరిపురపు దేముడు, నాగులపల్లి ప్రసాద్ ,ఎమ్.పవన్ కుమార్, ఇజ్జాడ సాయి , గాడి రమణ, పాలూరి బాబూరావు , యడ్ల బాష , వెంకటేష్ , జి.శ్రీనివాస్ , కుమార్ , కె.సాయి , పి. ధనరాజ్ , భార్గవ్ , అభిలాష్ ,హిమంత్ తదితరులు పాల్గొన్నారు. (Story : అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి)