ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నిక
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో స్కూల్ పీపుల్ లీడర్ (ఎస్. పి.ఎల్ ) ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు హెవేల మాట్లాడుతూ. ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థులు వారి ఓటు హక్కు, పోలింగ్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. దీని ద్వారా ఓటు వేసే విధానం పట్ల అవగాహన కలిగేలా నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, సోషల్ ఉపాధ్యాయురాలు ఎం. సౌజన్య, గోవింద నాయక్, మహేంద్ర, కృష్ణ ,పద్మావతి, రవి, బాలు, వెంకటేశ్వర్లు నాయక్ ,తదితర ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.(Story : ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నిక)