సుభాష్ చంద్రబోస్ కు ఘన నివాళి
రాష్ట్ర స్వయంసేవక సంఘ నాయకులు
తెలుగు తెలుగు/ వినుకొండ : సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గురువారం స్థానిక బోస్ పంపు సెంటర్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర స్వయంసేవక సంఘ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొని సుభాష్ చంద్రబోస్ జీవిత విశేషాలను మననం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ గుంటూరు విభాగ్ వ్యవస్థ ప్రముఖ్ వక్త కొత్తమాసు రవి మాట్లాడుతూ. సుభాష్ చంద్రబోస్ జరిపిన పోరాట విశేషాలు గురించి వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సభ్యులు మరియు హిందూ బంధువులు పాల్గొని వారికి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు వినుకొండ ఖండ కార్యవాహ ఇమ్మడిశెట్టి మల్లికార్జున, గట్టుపల్లి కాశి, అయితా రామారావు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మిత్తింటి కృష్ణాంజనేయులు, దేవతి పెద్ద నరసింహారావు, కొల్లిపర నాగేశ్వరరావు, కొప్పురావూరి కోటేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు మరియు ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ గోనుగుంట్ల లక్ష్మీ రాజేష్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. (Story :సుభాష్ చంద్రబోస్ కు ఘన నివాళి )