Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పశువులు చనిపోతే 21రోజుల్లోనే బీమా పరిహారం

పశువులు చనిపోతే 21రోజుల్లోనే బీమా పరిహారం

పశువులు చనిపోతే 21రోజుల్లోనే బీమా పరిహారం

నడిగడ్డలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ

న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశువులు చనిపోతే 21 రోజుల్లోనే పాడి రైతులు, జీవాల పెంపకందారులకు బీమా పరిహారం అందిస్తున్నామని చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది కాబట్టే పశుపోషకులకు ఆపన్న హస్తం అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తోందని, పశువులు, జీవాలకు గోకులం షెడ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతీ గ్రామానికి 2 గోకులాలు మంజూరు చేస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వినుకొండ మండలం నడిగడ్డలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశుఆరోగ్య శిబిరాన్ని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఆవులు, గొర్రెలకు స్వయంగా టీకాలు వేశారు. గోకుల షెడ్లు, బహువార్షిక పశుగ్రాస క్షేత్రాలు, పశు బీమా, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు, లింగ నిర్ధారిత వీర్యం, పిండ మార్పిడి పరిజ్ఞానం తదితర పథకాలపై రైతులకు పశు సంవర్ధకశాఖ అధికారులు, వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్‌ విప్ జీవీ మాట్లాడుతూ. ఈ నెల 20 నుంచి 31 వరకు గ్రామాల్లో నిర్వహిస్తు న్న ఉచిత పశు ఆరోగ్యశిబిరాలను రైతులు, పశువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశువులకు వైద్యం, గర్భకోశ వ్యాధులకు చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1962 ద్వారా ఒక్కో నియోజకవర్గంలో 2 సంచార పశు ఆరోగ్య సేవావాహనాలు ద్వారా సేవలు అందిస్తున్నారన్నారు. అవే వాహనాల పేరిట వైకాపా హయాంలో వందల కోట్లు కాజేశారని మండిపడ్డారు. నట్టల నివారణ మందులైనా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గోపాల మిత్రలకు జీతాలు కూడా ఇవ్వలేదని, ఎందుకు ఇవ్వలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. జగన్‌ పశువులకు బీమా కూడా చేయించలేదని, రాష్ట్రంలో 45 వేలకుపైగా గేదెలు చనిపోతే ఒక్కదానికి కూడా బీమా చెల్లించకుండా రైతులకు అన్యాయం చేశారన్నారు. ఉచితబీమా హామీ నీ గాలికి వదిలేసిన ప్రబుద్ధుడని ఎద్దేవా చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతులు ఎలాంటి బీమా చెల్లించకుండానే పశు బీమా అందించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులు బీమాలో 20 శాతం చెల్లిస్తే 80% చెల్లించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్రవ్యాప్తంగా 24 వేల గోకులాలు మంజూరు చేశారని, ఇప్పటికే 12,500 గోకులాలు ప్రారంభించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క గోకులం ఇవ్వకపోగా గత తెదేపా హయాంలో నిర్మించిన వాటికి కనీసం బిల్లులు కూడా చెల్లించలేదన్నారు చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. పశు సంపద, పశువులపై ఆదాయాన్ని పెంచడంతో పాటు గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో మాంసం పరిశ్రమను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోందని జీవీ ఆంజనేయులు తెలిపారు. (Story : పశువులు చనిపోతే 21రోజుల్లోనే బీమా పరిహారం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!