UA-35385725-1 UA-35385725-1

‘భైరవం’ గొప్ప కథాబలం వున్న సినిమా..

‘భైరవం’ గొప్ప కథాబలం వున్న సినిమా..

ఆడియన్స్ కి మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, విజయ్ కనకమేడల, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ‘భైరవం’ పవర్ ప్యాక్డ్ & విజువల్ స్టన్నింగ్ టీజర్ లాంచ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్  మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్ బస్టర్  ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈరోజు ఈ మూవీ  టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్ర తన కలలో సృష్టించిన వైలెన్స్ వివరిస్తూ, అతని యాక్షన్ ని శ్రీకృష్ణుడితో పోలుస్తూ లేడీ వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ కథ వారాహి గుడి, ముగ్గురు స్నేహితులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు నారా రోహిత్ చుట్టూ సాగుతుంది. వారు ఒకరి కోసం ఒకరు ఎంతకైనా తెగిస్తారు. ప్రారంభ సన్నివేశాలు శ్రీనివాస్ పాత్ర ఇంటెన్స్ నేచర్ ని హైలైట్ చేయగా, చివర్లో దేవుని ఆశీర్వాదం పొందుతున్నట్లుగా కనిపించడం కథలోని డివైన్ ఎలిమెంట్ ని సూచిస్తోంది.

దర్శకుడు విజయ్ కనకమేడల ఈ పవర్ ఫుల్ టీజర్ ద్వారా సినిమా లీడ్ రోల్స్ సెంటర్ కాన్ఫ్లిక్ట్ ని పరిచయం చేస్తూ, సినిమా ప్రిమైజ్ ని రివిల్ చేశారు. టీజర్  విజువల్ గా అద్భుతంగా ఉంది, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణ విలువలు గ్రాండ్ గా వున్నాయి. హరి కె వేదాంతం ఆకట్టుకునే కెమెరా పనితనం ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల తన ఇంటెన్స్ స్కోర్‌తో  ఎక్స్ పీరియన్స్ ని మరింత ఎలివేట్ చేశారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ రస్టిక్ లుక్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనోజ్ మంచు, నారా రోహిత్ కూడా ఫెరోషియస్ అండ్ డైనమిక్ రోల్స్ లో కనిపించారు. టీజర్ వారి ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేసింది. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు. హై-ఆక్టేన్ టీజర్ తో భైరవం గొప్ప అంచనాలను క్రియేట్ చేసింది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరిని చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈసారి మంచి కథా బలం ఉన్న సినిమాతో రావాలని బలంగా నిర్ణయించుకునే వస్తున్నాం. జయ జానకి నాయక కు మించి ఒక సినిమా చేయాలని నిర్మాత శ్రీధర్ గారితో చెప్పాను. అలా మంచి కథ కోసం వేట మొదలైంది. అలా భైరవం లాంటి మంచి కథ దొరికింది. ఈ సినిమాకి డైరెక్టర్ విజయ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమానే ఆయన వోన్ చేసుకున్న విధానం సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఆయన టాప్ డైరెక్టర్ అవుతారు. ఈ సినిమాని రోహిత్ గారు ఒప్పుకోవడం మోస్ట్ హ్యాపీ మూమెంట్. ఇది కథకు రోహిత్ గారు మనోజ్ గారు తప్పితే ఎవరు చేయలేరనే అంతా గొప్పగా చేశారు. వాళ్లతో వర్క్ చేసే అవకాశం ఒక బ్లెసింగ్ గా భావిస్తున్నాను. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఈ సినిమా చేసాం. తప్పకుండా మీరు ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. మా ఆర్ట్  డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ గారు టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మమ్మల్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను. అతిధి, ఆనంది, దివ్య అద్భుతంగా నటించారు. సినిమాని ప్రేమించే మీ అందరికీ థాంక్యూ వెరీ మచ్. ఇది ఒక మెమరబుల్ మూవీ అవుతుంది’ అన్నారు.

హీరో మనోజ్ మంచు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విజయ్ ఈ కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. ఇందులో నా బ్రదర్ రోహిత్, సాయి ఉన్నారని చెప్తే ఇంకా ఎక్సైట్ అయ్యాను. వెంటనే ఒప్పుకున్నాను. డైరెక్టర్ విజయ్ చాలా డెడికేటెడ్ గా ఈ సినిమాని తీశారు. ఆయన హార్డ్ వర్క్ కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నిర్మతలు రాధా మోహన్ గారికి, శ్రీధర్ గారికి థాంక్యూ సో మచ్. తమ్ముడు సాయి సొంత్ బ్రదర్ లానే. ఈ సినిమా చూశాను. సాయి పెర్ఫార్మెన్స్ చించి పారేశాడు. ఈ సినిమా గొప్ప విజయం కావాలని మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రోహిత్ బాబాయ్ నాకు చిన్నప్పటినుంచి క్లోజ్. ఈ సినిమాతో ఇంకా క్లోజ్ అయిపోయాం. ఒక్కడు మిగిలాడు సినిమా 2016లో చేసినప్పుడు రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ గ్యాప్ లో అది నా లాస్ట్ ఫిల్మ్. ఇప్పుడు మళ్లీ భైరవం టైటిల్ తో రోహిత్ తో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. తను అద్భుతంగా పెర్ఫాం చేశారు. తనతో కలిసి స్టెప్స్ వేయడం చాలా ఆనందంగా ఉంది. అతిథి సింగర్, మంచి డాన్సర్. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ అదిరిపోతుంది. సినిమా దుమ్ము లేచిపోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను’ అన్నారు.

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. భైరవం నా కెరియర్లో ఎప్పుడూ చేయని ఒక క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ని తీసుకొచ్చిన విజయ్ కి థాంక్యూ.  సినిమాని నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడానికి డైరెక్టర్ విజయ్, ప్రొడ్యూసర్ రాధా మోహన్ గారి సపోర్టే కారణం. మనోజ్ నాకు చిన్నప్పటినుంచి పరిచయం. కానీ ఈ సినిమా  మమ్మల్ని మరింత దగ్గర చేసింది. తను నాకు ఒక బ్రదర్. అవసరం ఉన్నప్పుడు ఉంటాడు. ఈ సినిమాతో మా ఇద్దరి బాండింగ్ మరింత పెరిగింది. ఈ సినిమాతో మరో బ్రదర్ సాయి వచ్చారు. సాయితో వర్క్ చేయడం వండర్ఫుల్ జర్నీ. సెట్స్ లో చాలా ఎంజాయ్ చేసాం. ఇది నాకు మోస్ట్  మెమొరబుల్ ఫిలిం. ఈ సినిమా విజయం సాధించి విజయ్ మరెన్నో పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ టీజర్ నచ్చడం ఆనందంగా ఉంది. త్వరలోనే సినిమా మీ ముందుకు వస్తుంది. థియేటర్స్ లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ…. మనోజ్ అన్న, సాయి గారు,  రోహిత్ గారు నన్ను ఒక సొంత బ్రదర్ లాగా చూసి చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. శ్రీ చరణ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల పాట బ్లాక్ బస్టర్  హిట్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలిచాలా అద్భుతమైన షట్ వర్క్ చేశారు. నిర్మాత రాధ మోహన్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు.  హరి ఫోటోగ్రఫీ ఈ సినిమాకి చాలా ప్లస్. ఈ సినిమాల్లో పని చేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇప్పటివరకు రోహిత్ గారిని ఒకలాగా చూసుంటారు ఈ సినిమాలో మరోలా చూస్తారు. ఆయనలోని మాస్ యాక్షన్ బయటికి వచ్చింది. ఈ సినిమా మాస్ యాక్షన్ ఆడియన్స్ కి పండగలా ఉంటుంది. మనోజ్ అన్నతో పని చేస్తే ఎనర్జీ మామూలుగా ఉండదు. ఆయన్ని చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. ఇప్పటివరకు సాయి గారు చేసిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు. ఈ సినిమాతో సాయి గారు ఒక రేంజ్ లో ఉంటారు. నన్ను కూడా ఒక మెట్టు పైకి తీసుకువెళ్తారు. ముగ్గురు హీరోలతో కలిసి పని చేయడం నాకు చాలా అద్భుతమైన అనుభూతి. నాంది చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యారో భైరవం చూసినప్పుడు కూడా అంతే థ్రిల్ ఎమోషన్ ఫీల్ అవుతారు. నాందికి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాతో నాకు అంతకంటే మంచి పేరు వస్తుంది’అన్నారు.

హీరోయిన్ అతిధి శంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్’ అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. డైరెక్టర్ విజయ్ తో ఇది నాకు మూడో కోలాబరేషన్. ఇందులో 8 పాటలు ఉన్నాయి. ఈ సినిమాకి కాలభైరవ స్తోత్రం కంపోజ్ చేయడం జరిగింది. అది చాలా అద్భుతంగా ఉంటుంది.  మనోజ్ గారు రోహిత్ గారు శ్రీనివాస్ గారు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు

నిర్మాత కేకే రాధా మోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా బ్యానర్ మొదలుపెట్టి 15 ఏళ్ళు అవుతుంది. మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. ముగ్గురు హీరోలు అనేసరికి నాకు మా డైరెక్టర్ గారికి కొంచెం టెన్షన్ వచ్చింది. అయితే మాకు ఎలాంటి టెన్షన్ ఇవ్వకుండ ఒక ముగ్గురు బ్రదర్స్ లాగా వాళ్లకు వాళ్లే చక్కగా మ్యానేజ్ చేసుకున్నారు.  అనుకున్న టైం లో సినిమాని కంప్లీట్ చేయగలిగాం. డైరెక్టర్ గారు చాలా పర్ఫెక్షనిస్ట్ . ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు.శ్రీ చరణ్ గారు ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. సినిమాలో బిజిఎం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కో ప్రొడ్యుసర్ శ్రీధర్ గారు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. బ్రహ్మ కడలి గారు ఎక్స్ట్రార్డినరీ సెట్ వేశారు ఈ సినిమా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

కో ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం సినిమా చాలా బాగా వచ్చింది. సాయి గారు మనోజ్ గారు రోహిత్ గారు చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. నాలుగు నెలల్లో ఈ సినిమా పూర్తి చేయగలిగామంటే వాళ్ళ సహకారం వలనే. ముగ్గురికి థాంక్స్ చెప్తున్నాను. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం’ అన్నారు.

యాక్టర్ సందీప్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద సినిమాలో అంత పెద్ద రోల్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కి థాంక్ యూ. ఈ సినిమా థియేటర్స్ లో ఓ అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.  టీజర్ ఎంత ఇంపాక్ట్ ఫుల్ గా వుందో సినిమా కూడా అంతే ఇంపాక్ట్ ఫుల్ గా వుంటుంది. శ్రీనివాస్ అన్న, మనోజ్ అన్న, రోహిత్ అన్న..ఈ సినిమాతో ముగ్గురు అన్నలు దొరికారు. వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది’ అన్నారు.  సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై

సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: కెకె రాధామోహన్
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)
సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్
సాహిత్యం: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
ఫైట్ మాస్టర్స్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
పీఆర్వో: వంశీ-శేఖర్ (Story : ‘భైరవం’ గొప్ప కథాబలం వున్న సినిమా..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1