నేను బతికుండగా రానయనా చూడాలని వుంది
న్యూస్ తెలుగు/చింతూరు : కామ్రేడ్ కు కాల్వపెల్లిఅడవి తల్లి వీడ్కోలు,,,!!
బీజాపురం ఎదురుకాల్పుల్లొ హతం,
పేల్చవేతల్లొ పోలీసులకు చుక్కలుచూపిన దామోదర్,
మిలట్రీ చీప్,రాష్ట్రసెక్రేటరీగా వ్యవహరణ ,
ప్రభుత్వానికే తలనొప్పిగా మారి
పార్టీకె రూపకర్తగ మారె,
బడేచొక్కారావు, దామోదర్ కు 2,50 కోట్ల రివార్డు ప్రకటించిన ప్రభుత్వం,
బీజాపురం ఎన్ కౌంటర్ లొ 19 మందిమావొలు హతం,
ఇందులొ దామోదర్ ఉన్నట్లు మావోస్టుపార్టీ పేరునలేఖ.
అలుపెరగని వీరుడికి అన్నలు లాల్ సలామ్,
తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వ పెల్లి స్వగ్రామం లొవిషాదం.
భూమికోసం భుక్తికోసం జల్ జంగల్ జమీన్ కోసం అడవిబాట పట్టిన కామ్రేడ్ దామోదర్ చత్తీష్ గడ్ బీజాపురం ఎన్ కౌంటర్ లొ హతం అయ్యాడు. ఈ ఎదురుకాల్పుల్లొ 19 మంది మావోయిస్టులు మృతిచేందారు.ఇందులొ కొందరు అగ్రనేతలు ఉన్నట్లు అనుమానాలు వచ్చాయి.ఇందులో దామోదర్ బడేచొక్కారావు ఉన్నట్లు మావోయిస్టు పార్టీ లేఖను విడుదలచేసింది. దీంతొ అనుమానాలు నిజమయ్యాయి. ఈ విషయం రాష్టంలోనె సంచలనమైంది.ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపెల్లికి చెందిన బడేచొక్కారావు అలియాస్ దామోదర్ బీజాపురం ఎన్ కౌంటర్ లొ మృతిచెందిన విషయం తెలంగాణ ములుగు జిల్లాలొ దావనంలా వ్యాపించింది.శనివారం రాత్రే మండలవ్యాప్తంగా తెలియడంతొ మండలంలొ నమ్మలేక పోతున్నారు టీవీలలొ చూసినవాల్లకు తెలపడంతొ చుట్టుప్పక్కల గ్రామాలకు తెల్సిపోయింది. కాల్వపెల్లిలొ సమాచారం తెల్సినట్లు అనుకుంటున్నారు.దామోదర్ కోసం తల్లి బతు కవ్వ!!కొడుకు దామోదర్ కోసం తల్లిబతుకవ్వ ఎదురుచూస్తుంది.15 రోజుల కిందట ములుగు ఎస్పి బరీష్ కాల్వపెల్లి సందర్సించారు. బడేదామోదర్ తల్లివద్దకు వెల్లి అడవిలొ ఉండిసాదించేది ఏమిలేదు లొంగిపోతె ప్రభుత్వపథకాలను అందిస్తామని నీద్వార సందేసం పంపించమని కోరారు.తల్లికూడ అదే మాట చెప్పింది,చావుకు దెగ్గరగా ఉన్నాను కడసారీ చూపైన చూడటానికి అడవిని వదిలి రానాయనా దామోదరా అనిచెప్పింది.అడవిలొ ఉంటె ప్రాణాలు పోతాయని ఇంటికి రమ్మని ఆదుకుంటామని కోరారు.
కన్నతల్లికి కడసారి శవమై కనిపించె!!
ప్రాణాలతొ చిన్నకొడుకైన దామోదర్ ను కడసారి కనులతొ చూద్దామని తల్లి బతుకవ్వ పిలిచింది. కాని శవమై కనిపిస్తాడని కళలొ కూడఊహించలేదు.బీజాపురంలొ జరిగిన ఎన్ కౌంటర్ లొ మృతిచెందిన విషయం తెలవగానే తల్లిప్రాణం తల్లడిల్లింది. కడసారీకూడా నోచుకోక పోతినని వృద్దురాలు విలవిల్లాడింది.(Story : నేను బతికుండగా రానయనా చూడాలని వుంది )