పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 18వ తేదీ నుండి ప్రతినెల మూడో శనివారం “స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోనే మన రాష్ట్రం పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 12 నెలలకు 12 థీమ్స్ తో స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జనవరి 2025 నెలలో “కొత్త సంవత్సరం-శుభ ప్రారంభం”అనే థీమ్ తో వినుకొండ పట్టణమును అత్యంత పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దేందుకు శనివారం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీ వి ఆంజనేయులు చే స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రజలచేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి ప్రజలు కాలుష్య భూతానికి కారణమైన సింగల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ వాడకమును పూర్తిగా నిలువరించాలని పిలుపునిచ్చారు. (Story : పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలి)