ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి
న్యూస్‌తెలుగు/ చింతూరు : ఎన్టీఆర్ 29వ వర్ధంతిని ఆయుర్వేద వైద్యులు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రుల ఆరాధ్యుడు నటసార్వభౌముడు, రాజకీయ దురంధరుడు పేదల పెన్నిధి డాక్టర్ బిరుదాoకితుడు నందమూరి తారకరామారావు అని కొనియాడారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచడం లో ఆయనకు ఆయనే సాటి అన్నారు. ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ ఉప సర్పంచ్ పి సాల్మన్ రాజు, ముత్యాల శ్రీరామ్, పొదిలి రామారావు తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి )