ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు..
– ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన
న్యూస్‌తెలుగు/ గుంతకల్లు : ప్రేమించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు వదిలేసాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన యువతి గొరవ అనిత అదే గ్రామంలో వాలింటర్ గా పని చేస్తున్న సమయంలో కొనకొండ్ల గ్రామానికి చెందిన చాకలి సంజీవ అనే యువకుడు అమెను నమ్మించి మాయమాటలు చెప్పి వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లి ఒక గదిలో చేసుకున్నారని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు ఆమె దగ్గర ఉండి తర్వాత ఆమెను వాడుకుని వదిలేసాడని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసే జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అతని కుటుంబం వేరే యువతితో పెళ్లికి సిద్ధం చేయగా శుక్రవారం గొరవ అనిత ప్రియుడి కుటుంబ సభ్యుల ఇంటి దగ్గరికి వెళ్లి వేరే పెళ్లి చేసుకోకూడదని ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన చేసింది. యువకుడి కుటుంబం తిరగబడడంతో ఆమె వజ్రకరూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. సదరు యువతి గొరవ అణిత తనకు న్యాయం చేయాలంటూ ఆమెతో పాటు కొంతమంది మహిళలు మద్దతు తెలిపారు. తనను ప్రేమించిన అబ్బాయి తోనే పెద్దల సమక్షంలో పెళ్లి చేసి న్యాయం చేయాలని బాధితురాలు అనిత పోలీసులను కోరింది.(Story: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు..)