మందుపాత్ర పేలుడు లో ఇద్దరు జవాన్లకు గాయాలు
న్యూస్‌తెలుగు/ చింతూరు : ఛత్తిస్ గడ్ రాష్ట్రం లోని బీజాపూర్ జిల్లా లో మందు పాత్ర పేలి 206 కోబ్రా దళానికి చెందిన ఇద్దరు జవాన్ లకు గాయలైయ్యాయి.వివరాలలోకి వెళితే బిజాపూర్ జిల్లా లోని పుట్కేల్ సి ఆర్ పి యఫ్ క్యాంపు కి చెందిన జవాన్లు కుంబింగ్ వెళుతుండుగా సుమారు. 3.8 కి. మీ. దూరం లో పేలుడు జరిగింది. ఈ పేలుడు లో మృదుల్ బర్మాన్కు రెండు కాళ్లకు, మొహమ్మద్ ఇషాక్ మోహా నికి గాయలైయ్యాయి.ఇద్దరు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. వీరద్దరినీ సమీపంలోని బాసగూడ సి ఆర్ పి యఫ్ క్యాంపు లో ప్రధమ చికిత్సలు రాయపూర్ ప్రధాన ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. (Story: మందుపాత్ర పేలుడు లో ఇద్దరు జవాన్లకు గాయాలు)