పండుగ సాయన్న విగ్రహావిష్కరణ
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా పానగల్ మండలం రాయన పల్లి గ్రామంలో ప్రజా వీరుడు పండుగ సాయన్న విగ్రహావిష్కరణ సందర్భంగా విగ్రహానికి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ , ముఖ్య అతిథిగా హాజరైన ముదిరాజ్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తో కలిసి నివాళులు నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ , సర్దార్ సర్వాయి పాపన్న సినిమా హీరో పంజాల జైహింద్ గౌడ్ , సినీనటి మమత గౌడ్ తదితర ముదిరాజ్ నాయకులు పండుగ సాయన్న కి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం వనపర్తి జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ముదిరాజ్ బంధుమిత్రులతో రాయినపల్లి గ్రామం కళకళలాడింది . జోహార్ తెనుగోళ్ల పండుగ సాయన్న , జై పండుగ సాయన్న ముదిరాజ్ , కొనసాగిస్తాం పండుగ సాయన్న గారి పోరాటాలను సాధిస్తాం పండుగ సాయన్న ఆశయాలను అనే నినాదాలతో రాయనిపల్లి గ్రామము దద్దరిల్లిపోయింది. (Story : పండుగ సాయన్న విగ్రహావిష్కరణ)