శ్రీ వివేకానంద హై స్కూల్ వారి సంక్రాంతి సంబరాలు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలోని గత 37 సంవత్సరాల నుండి విద్యను అందిస్తున్న శ్రీ వివేకానంద హై స్కూల్ సంక్రాంతి సంబరాలు, విఠంరాజు పల్లి లోని శ్రీ వివేకానంద బిఈడి కాలేజ్ ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగింది. చైర్మన్, కరెస్పాండెంట్ సయ్యద్ రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలను చాలా వైభవంగా జరుపుకుంటున్న అందుకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మరియు మా విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు మొదటి, రెండు, మూడవ బహుమతులతో పాటు పార్టిసిపెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి క్యాష్ ప్రైస్ గెలుచుకున్నారు. ఈ సందర్బంగా చిన్నారుల వివిధ వేషధారణ చిన్నారులకు భోగి పండ్లు మరియు ఎద్దుల బండ్ల ప్రదర్శన మరియు జానపద నృత్యాలు, హరిదాసు కీర్తనలు, టగ్ ఆఫ్ వార్ గేమ్స్ కబడ్డీ, కుట్టి గేమ్స్ లో పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా సంక్రాంతి ఆటపాటలు చాలా ఆనందోత్సాహాల మధ్యన జరిగాయి. స్కూల్ డైరెక్టర్ సయ్యద్ ఆరిఫ్ మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంబరాల్లో చిన్నారులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొనటం చాలా ఆనందం గా ఉంది. ఈ సంబరాల్లో ముగ్గుల పోటీలతో పాటు చిన్నారుల వేషధారణలతో భోగి పండ్లు, ఎద్దుల బండ్ల ప్రదర్శనతో, హరిదాసు కీర్తనలతో ఆటపాటలతో కుస్తీ పోటీలు, కబడ్డీ, పోటీలు ఉట్టి కొట్టి కార్యక్రమం గాలిపటాలు ఎగరవేయడం ఇలా ఇవే కాకుండా పాత కాలంలో పూర్వకాలంలో మనకి ఎలా అయితే పల్లెటూర్లలో వాతావరణం ఉంటదో ఆ విధంగా పిల్లలు ఇక్కడ విలేజ్ థీమ్స్ ని తయారు చేయటం వాటిని తల్లిదండ్రులు వీక్షించి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి సంబరాలు కి విచ్చేసిన స్కూల్ యాజమాన్యానికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అలాగే వినుకొండ నియోజకవర్గం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : శ్రీ వివేకానంద హై స్కూల్ వారి సంక్రాంతి సంబరాలు)