Homeవార్తలుతెలంగాణముగ్గులు భారత స్త్రీల హస్తకళకు ప్రతిబింబాలు జిల్లా ఎస్పీ

ముగ్గులు భారత స్త్రీల హస్తకళకు ప్రతిబింబాలు జిల్లా ఎస్పీ

ముగ్గులు భారత స్త్రీల హస్తకళకు ప్రతిబింబాలు జిల్లా ఎస్పీ

న్యూస్‌తెలుగు/వనపర్తి : ముగ్గులు భారతీయ మహిళల హస్తకళా నైపుణ్యానికి ప్రతిబింబాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జనమైత్రి క్రీడలలో భాగంగా జిల్లాలో మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీని ఎస్పీ కార్యాలయం క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారతీయుల సంస్కృతి సాంప్రదాయంలో ముగ్గులది ప్రధానమైన పాత్ర అని ఆయన వివరించారు.ఎలాంటి సాధనాలు ఉపయోగించకుండా మన మహిళలు మునివేళ్లతో వేసే ముగ్గులను ప్రపంచంలోని స్త్రీలంతా ఆశ్చర్యంగా చూస్తారని ఎస్పీ వివరించారు.అనాదిగా వస్తున్న ఈ కళలను ప్రోత్సహిస్తూ కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఎస్పీగారి సతీమణి శ్రీమతి అపర్ణ కుటుంబ సభ్యులతోపాటు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇతర ప్రాంతాలవారు ఉత్సాహంగా పాల్గొన్నారు.విజేతలకు ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్పి గారి సతీమణి శ్రీమతి, అపర్ణ గారు, డిసిఆర్బి డిఎస్పి, ఉమామహేశ్వర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు, మహిళ ఎస్సైలు, మహిళ, కానిస్టేబుల్, కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!