అమర వీరులకు జోహార్లు అర్పిస్తున్న సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్
తెలంగాణ, శ్రీకాకుళ సాయుధ పోరాటంలో అమరులైన వీరుల చిత్రపటాలను ఆవిష్కరించిన బంధుమిత్రుల సంఘం
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న బిక్కి రాములు, ఖాజామీయ, కమతం బాల వజ్రం, పమ్మి యోగి సుబ్బారెడ్డి ల స్థూపానికి శనివారం ఉదయం వారి చిత్రపటాలను ఆవిష్కరించారు. కమతం బాలవజరం, గాజుల కాజా మియా, పమ్మి యోగి సుబ్బారెడ్డి ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షురాలు బొప్పూడి అంజమ్మ, భవాని, శోభ, తదితరులు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సిపిఎం పార్టీ స్థానిక నాయకులు హనుమంత రెడ్డి, ప్రముఖ న్యాయవాది లూకా , విద్యావంతుల వేదిక నుండి సి హెచ్ ఎల్ ఎన్ మూర్తి, జాషువా సమాఖ్య నుండి రెడ్డి బోయిన ప్రసన్నకుమార్, పిడిఎం వై వెంకటేశ్వరరావు, పీకేఎస్ పోతురాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో సోషలిస్టు సాధన కోసం తమ విలువైన ప్రాణాలను త్రుణప్రాయంగా అర్పించిన అమరవీరులు వీరిని, వీరి స్ఫూర్తిని కొనసాగించడం అంటే దోపిడి పీడన అనిచివేతలు లేని ఉన్నతమైన సమాజం సోషలిజాన్ని సాధించడమే మన కర్తవ్యమని వక్తలు తమ ప్రసంగాలలో మాట్లాడారు. అంతేకాకుండా నేడు దండకారణ్యం రక్తసిక్తం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధమనకాండలను ఖండించాలని, ఊపా కేసులు ఎత్తివేయాలని, ఎన్ఐఏ ను రద్దు చేయాలని, హిందూ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని పెద్ద ఎత్తున నినదించారు. (Story : అమర వీరులకు జోహార్లు అర్పిస్తున్న సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్)