కోటి రూపాయలు విలువ గల గంజాయిని పట్టుకున్న పాచిపెంట పోలీసులు
న్యూస్ తెలుగు/ సాలూరు : కోటి రూపాయలు విలువ గల 671 కేజీల గంజాయిని పాచిపెంట పోలీసులు పట్టుకున్నారని పార్వతీపురం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి చెప్పారు. శుక్రవారం సాయంత్రం సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పాచి పెంట ఎస్సై వెంకట సురేసు వారి సిబ్బందితో గంజాయి అక్రమ రవాణా గురించి వారికి వచ్చిన రాబడి సమాచారం మేరకు వాహన తనిఖీలు నిర్వహించగా, వివిధ బృందాలుగా విభజించి మాతమూరు గ్రామ కూడలి వద్ద మరియు వేటగాని వలస జంక్షన్ వద్ద ఉదయం 6 గంటలనుండి వాహన తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రెండు బొలెరో వాహనాలు OD10P5913.
AP39AE9526 అను నెంబర్లు గల వాహనాలు అరకు వైపు నుండి సాలూరు వైపు కు వస్తున్నాయని తెలిపారు. ఆ వాహనాలు తనిఖీ చేయగా వారిని చూసి తప్పించుకున్నట్టు ప్రయత్నించారని తెలిపారు. ఎస్సై వారి సిబ్బంది వారి వెంట వెంబడించి రెండు వాహనములు మరియు ఆరుగురు ముద్దాయిలను పట్టుకొని వాహనముల తనిఖీ చేయగా వాటిలో 300 ప్యాకెట్స్ తో సుమారు 671 కేజీ గంజాయిని గుర్తించారని తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6సెల్ ఫోన్లు స్వాధీనుపరుచుకున్నామని. ఈ గంజాయి రవాణాకు ప్రథమ సూత్రధారి అయిన పడవు గ్రామ నివాసి అయిన కిసాన్ ప్రస్తుతం పరారీ లో ఉన్నారని అన్నారు. ప్రస్తుతం ఈ గంజాయి విలువ 80 లక్షల నుంచి కోటి రూపాయలు వరకు ఉంటుందని ఆయన
అన్నారు ఈ కార్యక్రమం లో పార్వతిపురం ఏ ఎస్పీ అంకిత్ మహావీర్ సురన,సాలూరు రూరల్ సిఐ రామకృష్ణ, పాచిపెంట ఎస్సై వెంకటసురేష్, సాలూరు రూరల్ ఎస్సై నరసింహ మూర్తి , సిబ్బంది పాల్గొన్నారు. వీరికి రివార్డ్స్ ఇవ్వాలని ఏ ఎస్ పి కి రెకమండ్ చేసిన ఎస్పీ మాధవరెడ్డి.