రాష్ట్రంలో బడుగుబలహిన వర్గాల వారికీ
రక్షణ కరువైంది
ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులే అభాగ్యులను చావకోడుతున్న వైనం
న్యూస్ తెలుగు /వినుకొండ : బొల్లాపల్లి మండలం వెంకటరెడ్డి పురం గ్రామానికి చెందిన వకుడావత్తు దుర్గా ప్రసాద్ నాయక్ అనే వ్యక్తిని ఈ నెల 7వ తారీఖున బొల్లాపల్లి ఎస్.ఐ బాలకృష్ణ దారుణంగా కులం పేరుతో దూషించి కొట్టడంతో సృహతప్పి పడిపోవడం జరిగింది. అతనికి మెరుగైన సేవలకోసం నరసరావుపేట ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతున్నాడు.
గురువారం దుర్గా ప్రసాద్ నాయక్ బాబాయి మాట్లాడుతూ. గత కొన్ని రోజుల క్రితం పొలం గట్టు దగ్గర చిన్న తగాదా జరిగిందని, అప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్ళగా ఎస్. ఐ బాలకృష్ణ ఇద్దరిపై కేసు కట్టడం జరిగింది. అది అంతటితో ఐయిపోగా మరల కొందరి ఒత్తిడితో ఈ నెల 7 వ తారీకున అన్న కొడుకు పొలంకు నీళ్ళు పెడుతుండగా ఇద్దరు కానిస్టేబుల్ లు వచ్చి స్టేషన్ కి రమ్మన్నారు. నేను మా ఇంట్లోవాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకోని వస్తానండి అన్నాడు. దానికి వారు నీకు ఏంటి అంత బలుపు పిలిసినప్పుడు రారా లంబాడి నా కొ….కా అని తిట్టారని తరువాత. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి ఆ రోజు సాయంత్రం ఎస్. ఐ కులం పేరుతో దుసిస్తూ, కొడుతూ మీకు పార్టీ లు ఎందుకు రా లంబాడి నా కొ…. కా అని తిట్టి వెళ్లిపోతు భుటుకాలితో మెడ మీద తన్నగా అతను సృహ తప్పి పడిపోయాడని వెంటనే కానిస్టేబుల్ లు బొల్లాపల్లి ప్రభుత్వ హాస్పటల్ కి తీసుకువెళ్ళి అక్కడ వైద్యులు వినుకొండ తీసుకువెళ్ళండి పరిస్తితి విషమంగా ఉంది అనగా, వినుకొండ తీసుకువస్తు వారి కుటుంభ సబ్యులమైన మాకు చెప్పడం జరిగింది . మేము వెంటనే వినుకొండకి బయలుదేరి రాగా అప్పటికే పట్టణం లోని జయతి హాస్పటల్ నందు చేర్చి కానిస్టేబుల్ హాస్పటల్ బయట ఉన్నారు. మేము వచ్ఛే వరకు వైద్యులు ఎటువంటి వైద్యం చేయలేదు, మేము వచ్చాక ప్రవేట్ హాస్పటల్ నందు వైద్యం చేపించుకునే స్తోమత లేక ఆ రోజు రాత్రి 12 గంటలకు వినుకొండ లోని ప్రభుత్వ హాస్పటల్ చేర్చడం జరిగింది. అక్కడ ప్రాదమిక చికిత్స చేసి మెరుగైన వైద్య సేవలకోసం నరసరావుపేట ప్రభుత్వ హాస్పటల్ కి పంపించారు. అప్పుడు మేము ఎస్. ఐ పై కేసు పెట్టాలని పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఉదయం 3 గంటల సమయంలో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఎవరి పై కేసు పెట్టాలి అని అడిగారు మేము బొల్లాపల్లి ఎస్. ఐ పై అనగా పోలీసులపై కేసు ఏంటి అలాగైతే మేము కేసు తీసుకోము అని వెళ్ళిపోయారు , మాకు నిన్నటి నుండి కేసుపెట్టకండి అని అనేక బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి అన్నారు. మా అన్న కొడుకు చావుబ్రతుకుల్లో ఉన్నాడని చెప్పారు… ఈ సందర్బంగా గురువారం పల్నాడు జిల్లా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం. ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ. ఒక బాద్యత కలిగిన ప్రభుత్వ ఉద్యోగి ఐయిన బొల్లాపల్లి ఎస్. ఐఅమాయకుల పట్ల ఈ విదంగా ప్రవర్తించడం సరికాదని ,పోలిస్ వ్యవస్థ ప్రజల్లో దైర్యాన్ని నింపాలని అది కాకుండా పోలిస్ అనగానే ప్రజలు బయపడే విదంగా ప్రవర్తించడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్యం అధికారంలోకి వచ్చిన తరువాత బొల్లాపల్లి మండలానికి ఎస్. ఐ గా వచ్చిన నాటి నుండి అమాయకులపై పలుమార్లు చేయి చేసుకున్న సందర్బాలు ఉన్నాయని, ఈరోజు అమాయకుడైన ఒక డిగ్రీ చదువుతున్న యువకుడి భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకోకుండా అతని విషయం లో ఈ విదంగా ప్రవర్తించడం సరికాదన్నారు. వెంటనే బొల్లాపల్లి ఎస్. ఐ ని సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించి బాదితుడికి న్యాయం జరిగే విదంగా చేయాలని ఉన్నత అధికారులని కోరడం జరిగిందన్నారు. (Story : రాష్ట్రంలో బడుగుబలహిన వర్గాల వారికీ రక్షణ కరువైంది)