యష్ బర్త్ డే సందర్భంగా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ పీక్ రిలీజ్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా: రాకింగ్ స్టార్ యష్.. కె.జి.యఫ్ ఫ్రాంచైజీ చిత్రాలతో గ్లోబల్ రేంజ్ స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న కథానాయకుడు. బుధవారం(జనవరి8న) యష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రేక్షకులకు ఆయన లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ నుంచి ‘బర్త్ డే పీక్’ అంటూ గ్లింప్స్ రూపంలో ట్రీట్‌ను విడుదల చేశారు. ఈ వీడియోను గమనిస్తే యష్ స్టైలిష్ లుక్‌తో కనిపిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా బోల్డ్ కంటెంట్‌తో సినిమా కథను వెండితెరపై ఆవిష్కరించే విధానంలో హద్దులను చెరిపేసేలా బర్త్ డే పీక్ ఉంది.
యష్ గడ్డంతో పెడోరా, సూట్ డ్రెస్ వేసుకుని సిగార్ కాలుస్తూ స్టైలిష్‌గా కనిపిస్తూ క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వటాన్ని, క్లబ్‌లోని ప్రతీ ఒక్కరి దృష్టిని యష్ ఆకర్షించటాన్ని గమనించవచ్చు. ఆయన క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తీరు వావ్ అనేలా మరో డిఫరెంట్ అవతార్‌లో రాకింగ్ స్టార్ మెప్పించటం ఖాయంగా అనిపిస్తోంది. బోల్డ్‌గా, రెచ్చగొట్టే మూమెంట్స్ తో నిండిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను మత్తుతో కూడిన ఆకర్షణీయమైన, హద్దులు దాటిన ప్రపంచంలోకి ఆహ్వానిస్తుంది. సినిమా ఓ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్నిస్తుందనటం
‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్’ చిత్రాన్ని..అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన , సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నేషనల్ అవార్డ్, గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డ్‌తో పాటు పలు అవార్డులు అందుకున్న గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కె.వి.ఎన్.ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్‌గా రూపొందిస్తున్నారు మేకర్స్. (Story : యష్ బర్త్ డే సందర్భంగా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ పీక్ రిలీజ్)