ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు అంటూ చేస్తున్న ప్రచారం అబద్ధం
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధం. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగింది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలి. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దు. (Story : ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు అంటూ చేస్తున్న ప్రచారం అబద్ధం)