విద్యుత్ చార్జీల పెంపుదలను
విరమించుకోవాలి : సిపిఎం
న్యూస్‌తెలుగు/చింతూరు : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై ట్రూ ఆఫ్, సర్దుబాటు చార్జీల పేరుతో 16000 కోట్లు రూపాయలు బారాలు వేయాలని సిద్ధపడింది. 2025 -26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టార్పులను పెంచే ఆలోచన చేసే విద్యుత్ చార్జీలను పెంచాలని విద్యుత్ పంపిణీ సంస్థలకు సర్కులర్ ఇచ్చిన నేపథ్యంలో మెసేజ్ చార్జర్ పంపుతాలను విరమించుకోవాలని, గతం విద్యుత్ తారీప్ లానే కొనసాగించాలని, లోపాయికారంగా అదా నీతో 1750 కోట్లు కమిషన్ తీసుకొని సోలార్ విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకున్న దాని రద్దు చేయాలని, విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాలని, చింతూరు మండలంలో విద్యుత్తు లేని గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చింతూరు విద్యుత్ ఏ డి ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్, కార్యదర్శివర్గ సభ్యులు సీసం సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచిందని, నేను అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆ హామీని తుంగలో తొక్కి విద్యుత్ చార్జీలు పెంపుదలకు సిద్ధమైందని అన్నారు. 2022 23 సంవత్సరానికి సంబంధించి వాడిన విద్యుత్ కి 16 వేల కోట్లు అదనంగా వినియోగదారుల నుండి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. 2024 -25 సంవత్సరానికి 5900 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థకి లోటు రావడంతో ఆ లోటును వినియోదారుల నుండి వసూలు చేయాలని పంపిణీ సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపుదలపై రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న నిరసనను వ్యతిరేకతను పరిగ నంలో తీసుకొని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నదని ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పారదర్శకంగా వ్యవహరించి విద్యుత్ వినియోగదారులకు న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం 1750 కోట్లు కమిషన్ తీసుకొని ఆదానికి సోలార్ విద్యుత్ సంబంధించి లోపాయికారి ఒప్పందాలని చేసుకున్నదని దీనిమీద విచారణ చేయకుండా ఈ ప్రభుత్వం కూడా అదానికి విద్యుత్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. విద్యుత్ పంపిణీ సంస్థలకి ప్రభుత్వం చెల్లించాల్సిన 43 వేల కోట్లు చెల్లించి విద్యుత్ సంస్థలకు న్యాయం చేయాలని, విద్యుత్ చార్జీల పెంపుదలను విరమించుకొని విద్యుత్ వినియోగదారులపై వేసే భారాలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. చింతూరు మండలంలో ఉన్న బలిమెల, చుక్కలపాడు, కొత్తూరు, చిన్న ఏడురాలపల్లి, పవర్ లంక గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. అనంతరం ఏడిఈ రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్, పోడియం లక్ష్మణ్, కల్మల మల్లేష్, కారం సుబ్బారావు, చింతా రాంబాబు, సవలం కన్నయ్య, ముట్టం రాజయ్య, మొర్రం పెడగయ్య, సోడి లెనిన్, పల్లపు పెదరాములు, తెపల్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : విద్యుత్ చార్జీల పెంపుదలను విరమించుకోవాలి :సిపిఎం)