ధనుర్మాస పూజలు
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక మెయిన్ బజార్ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి నిలయం నందు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం కృష్ణయ్యకు 108 మంది మహిళలతో దీపాలతో హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ. గత 26 రోజులుగా స్వామివారికి వివిధ రకాలైన పూజలు నిర్వహిస్తూ ఈనెల 11వ తారీఖు నాడు గూడారై ఉత్సవం 108 గంగాలతో పాయసంతో నివేదన జరుగును, అలానే 13వ తారీఖు భోగినాడు నాడు గోదా రంగనాధుల కళ్యాణం అత్యంత వైభవ్పేతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సనిశెట్టి సీత కొల్లిపర రాణి, అచ్యుత లక్ష్మి, కళ్యాణి చండీ రాజ్యలక్ష్మి, అరుణ, సనిశెట్టి వీరాంజనేయులు, అప్పలరాజు, ఉప్పల ప్రకాష్, సన్ శెట్టి గురవయ్య, తదితరులు పాల్గొన్నారు. (Story :ధనుర్మాస పూజలు)