Homeవార్తలుఅడివి శేష్‌ స్పై థ్రిల్లర్ G2 లో జాయిన్ అయిన వామికా గబ్బి  

అడివి శేష్‌ స్పై థ్రిల్లర్ G2 లో జాయిన్ అయిన వామికా గబ్బి  

అడివి శేష్‌ స్పై థ్రిల్లర్ G2 లో జాయిన్ అయిన

వామికా గబ్బి  

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : అడివి శేష్ హై-ఆక్టేన్ స్పై థ్రిల్లర్ G2తో అలరించబోతున్నారు. ఇది పాత్‌బ్రేకింగ్ హిట్ గూడచారికి సీక్వెల్‌. G2 ఇప్పటి వరకు అడివి శేష్ అత్యంత ప్రతిష్టాత్మకమైన హై-బడ్జెట్ చిత్రం మాత్రమే కాకుండా ఇండియన్  స్పై థ్రిల్లర్ ల్యాండ్‌స్కేప్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పై థ్రిల్లర్‌  ఒక సినిమాటిక్ మాస్టర్ పీస్ అవుతుందని హామీ ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ ఫ్రాంచైజీలో ఇమ్రాన్ హష్మీతో పాటు వామికా గబ్బి చేరారు. ఈ పవర్‌హౌస్ తారాగణంతో, G2 ట్రూ పాన్-ఇండియా మూవీ రూపొందుతోంది.

వామికా, అడివి శేష్ సరసన లీడ్‌గా నటిస్తోంది. ఆమె పాత్ర స్పై ప్రపంచానికి ఫ్రెష్  డైనమిక్ లేయర్ ని యాడ్ చేస్తోంది.

ఇటీవల అడివి శేష్‌తో యూరోపియన్ షూటింగ్ షెడ్యూల్‌ను ముగించిన వామికా ఈ చిత్రం గురించి ఉత్సాహంగా ఉన్నారు. “G2 అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మొదటి చిత్రం చెప్పుకోదగ్గ బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది, ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఆనందంగా, సవాలుగా ఉంటుంది. ప్రతిభావంతులైన తారాగణం, టీంతో కలిసి పనిచేయడం నాకు స్ఫూర్తినిస్తుంది’ అన్నారు

అడివి శేష్, వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ తో పాటు మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ,  మధు షాలిని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ  యాక్షన్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ డ్రామాతో  సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ -ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై  టి జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన జి 2 తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళం పాన్-ఇండియన్ విడుదల కానుంది.

పవర్‌హౌస్ తారాగణం, స్పై థ్రిల్లర్ స్టయిల్ ని రీడిఫైన్ చేయనున్న G2 నిస్సందేహంగా అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. G2 త్వరలో పెద్ద స్క్రీన్స్ కి రావడానికి సిద్ధమవుమౌతోంది. (Story : అడివి శేష్‌ స్పై థ్రిల్లర్ G2 లో జాయిన్ అయిన వామికా గబ్బి  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!