ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్ కి ఘన సన్మానం
విజయవాడ- సవేరా గ్రాండ్ గాంధీ నగర్: బాలగంగాధర్ తిలక్ డిజిపి టు సి పి ఆర్ ఓ గారికి ఘన సన్మానం చేసిన ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ. ఈ సందర్భంగా మహాసభ అధ్యక్షులు నారాయణ ముదిరాజ్ గారు మాట్లాడుతూ ఉన్నతమైన శాఖలో ఉంటూ కూడా పలువురికి ఆదర్శవంతంగా వుండే..గొప్ప వ్యక్తిత్వం కలిగిన శ్రీ తిలక్ గారికి ఈ సన్మానం చేయడం అనేది ఎంతో గొప్ప విషయం అని పేర్కొన్నారు స్నేహశీలి అజాతశత్రువు శ్రీ తిలక్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తామని మహాసభ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ సభ ముగింపు కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోర్న నారాయణ ముదిరాజ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లి బోయిన రాజు ,రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగన బోయినసాంబశివరావు,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దుప్పుల శివాజీ ముదిరాజ్ ,మైలవరం నియోజకవర్గ అధ్యక్షులు తోకల రవి, మైలవరం నుంచి పాలిపోయిన చిన్నారి,వాసు బాబు ,తెలంగాణ నుంచి వెంకటేష్ ముదిరాజ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. (Story : ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్ కి ఘన సన్మానం)