మల్టీ పర్పస్ లాస్ట్ బ్యాచ్ విద్యార్థుల
ఆత్మీయ సమ్మేళనం
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో 1969-70 మల్టీ పర్పస్ లాస్ట్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో నేడు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాశక్తి దినపత్రిక మాజీ ఎడిటర్ సదుర్ల వినయ్ కుమార్ అధ్యక్షత వహించారు. బంగారు మదన్మోహన్, డి శ్రీనివాసరెడ్డి, బి. లక్ష్మయ్య, కృపాకర్ రెడ్డి, రాఘవరెడ్డి, గోపాల్ జిరావ్ ల నేతృత్వంలో ఈ ఆత్మీయ మిత్రుల అపూర్వకలయిక అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులు సోమ సుందరం ను ఘనంగా సత్కరించి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ తమ కుటుంబ వివరాలను ఒక్కొక్కరు వేదిక ద్వారా చెప్పారు. తమతో పాటు చదువుకున్న వారు కొందరు మరణించడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సదుర్ల వినయ్ కుమార్ విలేకరులతో చెప్పారు. ముఖ్యంగా తమ బ్యాచ్ కు చెందిన వారు పేదరికంతో ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలని తాము నిర్ణయించామని చెప్పారు. అలాగే వనపర్తి రాజభవనమైన ప్రస్తుత పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పూర్వం మాదిరిగా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలిచామన్నారు. తదుపరి తమ ఆత్మీయ సమ్మేళనంలో తప్పనిసరిగా తమ కుటుంబ సభ్యులతో కలిసి రావాలని నిర్ణయించామన్నారు. అలాగే 2030 నాటికి బ్యాచ్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నందున పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని ఆయన వివరించారు. (Story : మల్టీ పర్పస్ లాస్ట్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం)