రాష్ట్ర ఆర్టీఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గా
షైక్ మహమ్మద్ బాషా
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్ర ఆర్టీఐ వర్కింగ్ ప్రసిడెంట్ గా షైక్ మహమ్మద్ బాషా ని నియమిస్తూ నియామక ఉత్తర్వులను ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరే రంగా సాయి రెడ్డి అందజేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు మధిరె రంగసాయిరెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని 8 విభాగాల్లో రాష్ట్ర అధ్యక్షులు , కార్యవర్గ సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా ఆర్.టి.ఐ విభాగానికి సంబంధించి షైక్ మహమ్మద్ బాషా ని నియమిస్తూ నియామక పత్రాలను ఆయన అందజేశారు. అలాగే ఆయా శాఖల కు సంబంధించి కార్యవర్గ సభ్యులను నియమించి పత్రాలను అందజేశారు . వీరి పదవి కాలం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఆయన ధ్రువీకరించారు. ప్రజా సంకల్ప వేదిక ఆర్గనైజేషన్ 205/2021 న రిజిస్ట్రేషన్ కాబడిందని, అలాగే నీతి ఆయోగ్ లో నమోదు కాబడిందని తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా ప్రజాసంకల్ప వేదిక అందులోని విభాగాలు ఆయా ప్రాంతాలలో పనిచేస్తాయని సూచించారు. అనంతరం కార్యవర్గ కమిటీ సభ్యులకు, నియోజకవర్గ సభ్యులకు నియామక ఉత్తర్వులను ఆయన సభాముఖంగా అందజేశారు. (Story : రాష్ట్ర ఆర్టీఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గా షైక్ మహమ్మద్ బాషా)