ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించటంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ప్రజావాణి ఫిర్యాదులతోపాటు సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన ఫిర్యాదులను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో 60 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి)