ప్రజా క్షేమమే పరమావధి
డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్ తో ఆయుర్వేద వైద్యలు జమాల్ ఖాన్
డీజీ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జమాల్ ఖాన్
న్యూస్ తెలుగు/చింతూరు : ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కానీ ప్రజా క్షేమమే పరమావధిగా విధులు నిర్వహించాలని పరమాత్ముని ఆదేశంతోనే ఈ పదవులు పొందుతారని ఇస్లాం, హిందూధర్మo గీత . ఖురాన్లు సిరాతల్ ముస్తఖీన్ అంటే రుజుమార్గము, సన్మార్గము వైపు నడిపించమని చెబుతున్నాయని మానవాళి అంతా కూడా సమానమేనంటూ కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి సోదర భావంతో జీవించాలని, పరోపకారం, సహనం సానుభూతి వంటివి ప్రతి ఒక్కరిలో అలవర్చుకోవాలని ద్వేషం పగ ప్రతీకారం దురలవాట్లు దూరంగా ఉంటూ సన్మార్గంలో జీవితాన్ని నడిపిస్తే సుఖమయం అవుతుందని జీవితానికి అర్థం పరమార్థం దక్కుతుందని ఒకరినొకరు గీత ఖురాన్ యొక్క ఉపదేశాలను నెమరు వేసుకున్నారు. సర్వ మానవాళి కి శాంతి చేకూరేలా అన్ని మతాలు మత గ్రంధాలు మంచి విషయాలను చెబుతున్నాయని వ్యక్తిగత స్వార్ధాలు, మితిమీరిన కోరికలు అదుపులో పెట్టుకొని అందరూ మనవారే అని ప్రేమతో జీవించగలిగితే అంతకుమించిన భాగ్యం మరొకటి లేదన్నారు. ఆయుర్వేద వైద్యంతో జెకె సిటీ ట్రస్ట్ తో ఎంతోమంది నిరుపేద అభాగ్యులకు రోగ పీడితులకు, బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తూ సేవలందిస్తున్న జమాల్ ఖాన్,…. రాష్ట్ర ప్రజల శాంతిభద్రతలను కాపాడుతూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర భద్రత తన బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న డిస్టర్ రెస్పాన్సిబుల్ డిజీ మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్ ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం జెకె సిటీ ట్రస్ట్ క్యాలెండర్ డైరీను డిజికి జమాల్ ఖాన్ అందజేశారు.(Story : ప్రజా క్షేమమే పరమావధి )