‘సంక్రాంతికి వస్తున్నాం’లో నా డ్రీం రోల్ చేశాను
హీరోయిన్ మీనాక్షి చౌదరి
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో పార్ట్ కావడం ఎలా అనిపిస్తోంది ?
-చాలా ఆనందంగా వుంది. చాలా గ్రేట్ ఫుల్ గా వున్నాను. ఫస్ట్ టైం కామెడీ జోనర్ ట్రై చేశాను. ఇందులో కామెడీ స్పేస్ లో కాప్ రోల్ ప్లే చేయడం చాలా ఎక్సయిటింగ్ గా వుంది. నన్ను కాప్ రోల్ చూడటం ఆడియన్స్ కి కూడా ఓ కొత్త ఎక్స్ పీరియన్స్. ఫస్ట్ టైం ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు చేశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
సంక్రాంతి రావడం ఎలా అనిపిస్తోంది ?
-లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా వుంది. ఈ జర్నీ ఒక డ్రీమ్ లా వుంది. నన్ను బిలీవ్ చేసిన ఇంత మంచి అవకాశాల్ని ఇచ్చిన దర్శక నిర్మాతలు ధన్యవాదాలు. నన్ను నేను నిరూపించుకునే మంచి కథలు, పాత్రలు రావడం చాలా సంతోషంగా వుంది.
ఇందులో కాప్ రోల్ కోసం ఏదైనా రిఫరెన్స్ తీసుకున్నారా ?
-కాప్ రోల్ చేయాలనేది నా డ్రీం. లక్కీ నా కెరీర్ బిగినింగ్ లోనే రావడం సంతోషంగా వుంది. రిఫరెన్స్ ఏమీ తీసుకోలేదు. మా డాడీ ఆర్మీ ఆఫీసర్. ఆఫీసర్ బాడీ లాంజ్వెజ్ పై ఐడియా వుంది. నేను కూడా కొంత హోం వర్క్ చేశాను.
వెంకటేష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-వెంకటేష్ గారితో వర్క్ చేయడం సూపర్ ఎక్స్ పీరియన్స్. ఆయన వండర్ ఫుల్ హ్యూమన్. ఆయనలో ఎప్పుడూ ఒక ఆనందం కనిపిస్తుంటుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. అనిల్, వెంకీ గారిది సూపర్ హిట్ కాంబినేషన్. సెట్ లో కూడా ఒక మంచి రేపో వుండేది. సీన్స్ అన్నీ ఫ్లోలో అద్భుతంగా జరిగాయి. వెంకటేష్ గారు చాలా ఫిట్ అండ్ ఎనర్జిటిక్ గా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.
ఐశ్వర్య రాజేష్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి ?
-ఐశ్వర్య రాజేష్ గారు ఎస్టాబ్లెస్ యాక్టర్. ఐశ్వర్య నటించిన చాలా సినిమాలు చూశాను. ఒక ఫ్యాన్ మూమెంట్ లా అనిపించింది, తను చాలా పాజిటివ్ గా వుంటారు. తనతో కలసి పని చేయడం హ్యాపీగా అనిపించింది. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఈ సినిమా పాటలు బిగ్ హిట్ అయ్యాయి.. బీమ్స్ మ్యూజిక్ గురించి?
-నేను యాక్ట్ చేసిన సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ కావడం ఇదే తొలిసారి. గోదారి గట్టు సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. తర్వాత నా పేరు ‘మీను’ మీద వచ్చిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో సినిమా కూడా అలానే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.
సినిమా ప్రమోషన్స్ ని చాలా వెరైటీగా చేయడం ఎలా అనిపిస్తోంది ?
-ఈ సినిమా ప్రమోషన్స్ కి నా దగ్గర టైం వుంది. కొత్త కొత్త ఐడియాలతో సినిమాని ప్రమోట్ చేస్తున్నాం. వెంకీ మామ క్యారెక్టర్స్ తో స్కిట్ చేయడం చాలా ఫన్ ఎక్స్ పీరియన్స్.
అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో చేయడం ఎలా అనిపించింది ?
-అనిల్ గారి కామెడీ టైమింగ్ ఫెంటాస్టిక్. కామెడీ తీయడం అంత ఈజీ కాదు. సీన్ బెటర్ మెంట్ కోసం స్పాంటినియస్ గా ఆలోచించాలి. సీన్ బెటర్ చేయడంలో అనిల్ గారి ఆలోచనలు చాలా అద్భుతంగా వుంటాయి. నేను కామెడీ చేయడం ఫస్ట్ టైం. ఆయన చాలా ఓపికగా ప్రతిది డిటేయిల్ గా ఎక్స్ ప్లేయిన్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.
‘సంక్రాంతికి వస్తున్నాం’ ఏ జోనర్ ఫిల్మ్ ?
-ఇది మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. మేజర్ పోర్షన్ కామెడీ వుంటుంది. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అన్నీ ఎమోషన్స్ వుంటాయి.
దిల్ రాజు గారి నిర్మాణంలో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. దిల్ రాజు గారు ప్రమోషన్స్ లో కూడా పార్ట్ అవ్వడం ఆనందంగా అనిపించింది. శిరీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. వారి నిర్మాణంలో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. దిల్ రాజు గారి నుంచి వస్తున్న గేమ్ చెంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలు బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
అన్ స్టాపబుల్ లో బాలయ్య గారిని కలవడం ఎలా అనిపించింది?
-బాలయ్య గారు.. వన్ అండ్ ఓన్లీ ఓజీ.(నవ్వుతూ) ఎప్పుడూ యాక్టివ్ అండ్ ఎనర్జిటిక్ గా వుంటారు. చాలా ఎమోషనల్ అండ్ వండర్ ఫుల్ పర్శన్.
కొత్త సినిమాల గురించి ?
-నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తున్నాను. మరో రెండు సినిమాలు మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ఈ ఏడాది కూడా వండర్ ఫుల్ గా వుంటుందని ఆశిస్తున్నాను.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ (Story : ‘సంక్రాంతికి వస్తున్నాం’లో నా డ్రీం రోల్ చేశాను)