మావోయిస్టు ప్రభావిత ప్రాంతం లో మొదటి మహిళా పైలట్
తండ్రి కలను నెరవేర్చిన పైలట్ సాక్షి సురానా
న్యూస్ తెలుగు/చింతూరు : మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అయిన దంతివాడ లో తండ్రికన్న కలను నెరవేర్చిన ఓ కమార్తె కధ ఇది. వివరాలలోకి వెళితే చత్తీస్గడ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతివాడ జిల్లా గీదం నగర పంచాయతీ కి చెందిన సాక్షి సూరానా తండ్రి గారి కలను నెరవేర్చేందుకు ఆమె ఎత్తుకెగిరి పైలెట్ గా మారింది. సాక్షి సూరానా జిల్లాకే కాకుండా డివిజనకు మొట్టమొదటి శిక్షణ పొందిన అనంతరం పైలెట్ గా నిలిచింది. ఈ విజయం తర్వాత గీదం బాలికలు విభిన్న రంగాల్లో అద్భుతాలు చేయడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు గంటల పాటు సాక్షి సూరానా పైలట్ గా విహరించిన తర్వాత డిజిసిఎ లైసెన్స్ కూడా పొందింది. ఇప్పుడు విమానం టేక్ అప్ కి ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ప్రస్తుతం ఆమె ఎయిర్ ఇండియాలో దరఖాస్తు చేసుకుంది. అంతా సవ్యంగానే జరిగితే ఈ ఏడాది నుంచే విమాన ప్రారంభించనుంది. సాక్షి సూరానా తండ్రి కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారవేత్త జవహర్ సురానా, తాత దివంగత రతన్లాల్ సురానా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. అమ్మమ్మ పంచి దేవి సూరానా గీదం నగర పంచాయతీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.(Story : మావోయిస్టు ప్రభావిత ప్రాంతం లో మొదటి మహిళా పైలట్ )