ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి అమ్మయ్య మృతి
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పెన్షనర్స్ అసోసియేషన్ ట్రెజరర్ దాసరి అమ్మయ్య ( 84 ) గురువారం మృతి చెందారు. వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. దాసరి అమ్మయ్య ఎన్ఎస్పి నందు మెడికల్ ఆఫీసర్ గా మరియు మెడికల్ అధికారిగా ఐదు మండలాల నందు ఎం పి హెచ్ ఈ ఓ విధులు నిర్వహించి మరియు ఎన్ఎస్పి కాలనీ నందు విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. వీరికి మృతికి నియోజకవర్గంలోని రిటైర్డ్ ఎమ్మార్వో అధ్యక్షులు కాళ్ళ కృష్ణమూర్తి, సుబ్బారెడ్డి మాస్టారు, సుబ్రమణ్యం, దుబ్బల దాసు, తదితర విశ్రాంత ఉద్యోగులు ఆయన సేవలను పలువురు కొనియాడి ఘనంగా నివాళులర్పించారు. (Story : ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి అమ్మయ్య మృతి)