“ఆరోగ్యమే ఆద్యమైన ఆస్తి: పేదల బలహీనతకు చంద్రబాబు బాసట”
వినుకొండ నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ, దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్బంగా జివి మాట్లాడుతూ. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపడం విశేషమన్నారు. గురువారం వినుకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 31 లబ్ధిదారులకు రూ. 68 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, గత ఆరు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్‌ఎఫ్ నిధులను సీఎం అందించారని, ఇది పేద ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు నింపిందని పేర్కొన్నారు.అంతేగాక, ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు అధిక గౌరవం పొందాయన్నారు. రోగులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించడం చంద్రబాబు చొరవతోనే సాధ్యమైందని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, అది ప్రజల్లో నిరాశను నింపిందని వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం పునరుజ్జీవితం పొందిందని, ప్రజల ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. వైద్య సేవలకు సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించడం వల్ల ప్రజలకు సేవలు సులభతరం అయ్యాయని చెబుతూ, చంద్రబాబు నాయకత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు.”వినుకొండ నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. (Story : “ఆరోగ్యమే ఆద్యమైన ఆస్తి: పేదల బలహీనతకు చంద్రబాబు బాసట” )